Index
అలీ హీరోగా ఫీల్ గుడ్ చిత్రం అలీ, సుప్రేన జంటగా యమ్మెస్ శ్రీ చంద్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీ సాయిదుర్గ ఆర్ట్స్ నిర్మిస్తున్న చిత్రం అన్నపూర్ణ స్టూడియోలో ఆరంభమైంది. ఈ సందర్భంగా చిత్రీకరించిన తొలి సన్నివేశానికి చలపతి రావు కెమెరా స్విచాన్ చేయగా, లగడపాటి శ్రీదర్ క్లాప్ నిచ్చారు. ఎస్వీ కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. 'తన వల్ల ఇతరులకు, ఇతరుల వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనుకునే యువకుడి కథ ఇది. నేటి నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతున్నాం. డిసెంబర్ లో సినిమా పూర్తవుతుంది. జనవరిలో పాటలు చిత్రీకరిస్తాం' అని దర్శకుడు అన్నారు. 'మంచి ఫీల్ వున్న చిత్రం ఇది. కథ వినగానే నచ్చింది' అని తెలిపారు. అమెరికా లో డాక్టర్ గా వ్యవహరిస్తున్న నాకు సినిమాలంటే చాలా ఇష్టం అని నిర్మాత డా.విజయ్ కుమార్ చెప్పారు. ఈ చిత్రానికి కోటి సంగీతం అదించనున్నారు. |