Index
ఇద్దరు హీరోలతో శ్వేతా ప్రసాద్ 'కొత్తబంగారు లోకం' తో కుర్రకారుని కొత్తలోకం చూపించిన కథానాయిక శ్వేతాబసు ప్రసాద్ సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కథ నచ్చితే నే చేస్తానని కచ్చితంగా చెబుతున్నారామె. తెలుగులో రెండో సినిమాకు పచ్చజెండా ఊపారామె.
ఎన్వీ ప్రసాద్ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే డేట్స్ ఇచ్చారు. డిసెంబరు మొదటివారంలో చిత్రీకరణ మొదలు కానున్న ఈ చిత్రంలో ఇద్దరు ప్రముఖ యువ కథానాయకులు నటిస్తారు. నిర్మాణం, పంపిణీ, ప్రదర్శన రంగాల్లో అనుభవజ్నులైన కొందరు మిత్రులు 'రత్నా సెల్యు లాయిడ్స్' పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. |