Index
'నేనింతే' లో వి.వి.వినాయక్ రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'నేనింతే'. పూరి జగన్నాథ్ దర్శకుడు. ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ నటించారు. ఇందులో ఆయన దర్శకుడు వినాయక్ గానే కనిపిస్తారు. కథానాయికకి సూచనలిస్తూ, తన చిత్రం ఎడిటింగ్ చేసుకుంటూ ఉండే సన్నివేశాల్లో ఆయన నటించారు. 'నేనింతే' చిత్ర పరిశ్రమ నేపథ్యంలో సాగే కథ. ఇందులో కథానాయకుడు సహాయ దర్శకుడి పాత్రను పోషిస్తున్నారు. అలాగే కథానాయిక గ్రూప్ డ్యాన్సర్ . కాబట్టి వినాయక్ పాత్ర కూడా కథలో భాగంగానే వస్తుంది.
వినాయక్ తెర మీద కనిపించడం ఇదే తొలిసారి కాదు. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'ఠాగూర్' లో కూడా నటించారు. చిరంజీవి తయారు చేసే ఏసీఎఫ్ బృందంలో కీలక సభ్యుడిగా వినాయక్ ఓ పాత్ర పోషించారు. |