| | Cinema Kaburlu | Index
శరవేగంగా గోపీచంద్ 'శంఖం' గోపీచంద్, త్రిష జంటగా శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై శివ దర్శకత్వంలో జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్న చిత్రం 'శంఖం' శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శివ మాట్లాడుతూ 'గోపీచంద్ బాడీ లాంగ్వేజ్ కు సరిపడ కథ ఇది. అన్ని తరగతుల వారికి కావలసిన అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఆస్ట్రేలియా షెడ్యూల్ తో సినిమా షూటింగ్ పార్ట్ ముగుస్తుంది. ఆగస్టులో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం' అని చెప్పారు.
నిర్మాత జె.పుల్లారావు మాట్లాడుతూ 'ఈ చిత్ర కథకు అన్ని విధాల సరిపోయే పేరు 'శంఖం'. జులై మూడవ వారంలో ఆడియో విదుదల ఉంటుంది. ఇందులో ఓ కీలక పాత్రను తమిళ నటుడు సత్యరాజ్ పోషిస్తున్నారు' అని వివరించారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కోటశ్రీనివాసరావు, చంద్రమోహన్, ధర్మవరపు, అలీ, వేణుమాదవ్, ఎమ్మెస్ నారాయణ, ఎల్బీశ్రీరామ్, కృష్ణభగవాన్, శ్రీనివాసరెడ్డి, బెనర్జీ, సీత, రజిత, తెలంగాణ శకుంతల, రాదాకుమారి నటిస్తున్నారు. |  |
|
|