| | Cinema Kaburlu | Index
కృష్ణుడు 'అమాయకుడు' కృష్ణుడు కథానాయకుడిగా 'అమాయకుడు' అనే చిత్రం రూపొందుతోంది. ఆక్టాగాన్ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. అనన్య, అలేఖ్యరావు నాయికలు. ఎం.బాల మురుగన్, అనిల్.ఎస్.నాయర్, సుదర్శన్ శర్మ నిర్మాతలు. భారతి గణేష్ దర్శకుడు. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్ లో ఆదివారం ఉదయం జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి శ్రీహరి క్లాప్నిచ్చారు. చిత్ర నిర్మాతలు కెమెరా స్విచాన్ చేశారు.
దర్శకుడు భారతి గణేష్ మాట్లాడుతూ 'వైవిధ్యమైన కథ ఇది. మొదటి సన్నివేశం నుంచి చివరి సన్నివేశం వరకు నవ్వులను కురిపిస్తూనే ఉంటుందన్నారు.
ఒకే షెడ్యూల్ లో చిత్రాన్ని పూర్తి చేయడానికి సన్నాహలు చేస్తున్నామని నిర్మాతలు చెప్పారు. |  |
|
|