Cast: Allari Naresh, Kamna Jetmalani, Meghana Director:E.V.V.Satyanarayana Producer:D.Ramanaidu Music:Koti
 Synopsis 'బెండు అప్పారావు ఆర్.యం.పి' చిత్రానికి దర్శకుడు ఈ.వి.వి.సత్యనారాయణ. ఈ చిత్రంలో 'అల్లరి'నరేష్, కామ్నాజఠ్మలాని, మేఘన ముఖ్య పాత్రదారులు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ పై.లిమిటెడ్ పతాకంపై డా.డి.రామానాయుడు నిర్మిస్తున్నారు.
'ఈ చిత్రం దర్శకునిగా ఈ.వి.వి కి, కథానాయకుడిగా నరేష్ కు మంచి పేరు తెచ్చిపెడుతుంది. నిర్మాతగా నాకు డబ్బులతో పాటు, మా సంస్థలో మరో హిట్ చిత్రంగా ఈ సినిమా నిలబడుతుంది. ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు, హాస్యం ఇలా అన్నీ సమపాళ్ళలో కుదిరిన చిత్రం ఇది. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకముంది' అని తెలిపారు డా.డి.రామానాయుడు.
దర్శకుడు మాట్లాడుతూ 'పూర్తి వినోదాత్మకంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను నాన్ స్టాప్ గా రెండున్నర గంటల పాటు నవ్విస్తుంది. గతంలో సురేష్ ప్రొడక్షన్స్ లో వచ్చిన పూర్తి హాస్యభరిత చిత్రం 'అహ నా పెళ్ళంట' తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో ఆడియన్స్ ను కడుపుబ్బ నవ్వించే సినిమాల కోవలో ఇది చేరుతుంది. యూరప్ లో చిత్రీకరించిన పాటలు చిత్రానికి అదనపు వన్నెను తెచ్చాయి. నాయికలు కామ్నాజఠ్మలానీ, మేఘన అందచందాలు, వారి అభినయం కూడా అందర్నీ అలరిస్తుంది. 'ప్రేమఖైదీ' చిత్రం నన్ను దర్శకునిగా బిజీ చేసింది. ఈ చిత్రం కూడా నా కెరీర్ ను మరింత వేగవంతం చేస్తుంది' అన్నారు. ఈ చిత్రం ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. |  |
|