Cast: Sairam Shankar, Bindu Madhavi Director:Jaya Ravindra Producer:Puri Jagannadh Music:Raghu Kunche Synopsis 'బంపర్ ఆఫర్' చిత్రానికి దర్శకుడు జయరవీంద్ర. ఈ చిత్రంలో సాయిరామ్ శంకర్, బిందుమాధవి జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వైష్ణో అకాడమీ పతాకంపై పూరిజగన్నాథ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర ఎగ్జిక్యూటివ్ నిర్మాత శంకర్ గణెష్ చిత్ర విశేషాలను తెలియజేస్తూ 'సాయి ఈ చిత్రంలో కొత్త గెటప్ లో కనిపిస్తాడు. నేపథ్య గాయకుడు రఘుకుంచె ఈ చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇటీవలే విడుదలైన పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన వస్తుంది. పూరిజగన్నాథ్ ఈ చిత్రానికి కథ, మాటలు అందించారు. ఆయన శిష్యుడు జయరవీంద్ర ఆయన తరహాలోనే చిత్రాన్ని చాలా అద్బుతంగా తెరకెక్కించారు. తప్పకుండా చిత్రం అన్ని వర్గాల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాను. మాస్ ను ఆకట్టుకునే విషయాలు పుష్కలంగా ఉన్నాయి. హీరో సాయిరామ్ శంకర్ కు ఈ చిత్రం మంచి బ్రేక్ నిస్తుందని ఆశిస్తున్నాను' అన్నారు. ఈ చిత్రం ఈ నెల 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది.